చిన్నారుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త యాప్.

 


ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సోషల్‌ మీడియా సైట్లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. దీని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ అనే విషయం తెలిసిందే. 2/6 యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్‌.. ఫేస్‌బుక్‌కు అల్టర్‌నేటివ్‌గా బాగా ప్రాధాన్యత సంపాదించుకుంది. 3/6 ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల ఫాలోయింగ్‌ ఆప్షన్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఇది 13 ఏళ్ల లోపు చిన్నారులకు ఎంతో మేలు చేయనుంది. 4/6 ఇదిలా ఉంటే తాజాగా చిన్నారుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ ఏకంగా కొత్త యాప్‌ను తీసుకురానుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ మొస్సెరీ తెలిపారు. 5/6 ఇప్పటికే ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న 'మెసేంజర్‌ కిండ్స్‌'కు కొనసాగింపుగా ఈ యాప్‌ను తీసుకురానున్నారు. 6/6 చిన్నారులు వాడే ఈ యాప్‌పై పేరెంట్స్‌ కంట్రోలింగ్‌ ఎక్కువగా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఈయాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.