వ్యవసాయ రంగాన్ని విస్తరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ.

 


వ్యవసాయ రంగాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆహారోత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు ఇది సూచికగా నిలుస్తుందన్నారు. ధాన్యం, గోధుమలను పండించడానికి రైతులు పరిమితం కావొద్దని.. ఆర్గానిక్ ఫుడ్, సలాడ్‌కు సంబంధించిన కాయగూరల సాగు వైపుగా అన్నదాతలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. ఆహారోత్పత్తిలో ఇలాంటి మార్పులకు రెండు, మూడు దశాబ్దాల కిందే శ్రీకారం చుట్టాల్సిందన్నారు. ఫుడ్, వెజిటబుల్స్‌తోపాటు ఫ్రూట్స్, ఫిషరీస్ లాంటి వాటిపై కూడా రైతులు ఫోకస్ చేయాలన్నారు. రైతులకు తమ గ్రామాల్లోనే ఆధునిక వసుతులను కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో రీసెర్చ్, డెవలప్‌మెంట్ కోసం ప్రైవేటు సెక్టార్‌కు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.