మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .

 


మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం చెవులతండా మద్దిగట్ల స్టేజీ వద్ద బుధవారం జరిగింది. మధ్యాహ్నం వేళ అతివేగంగా వస్తున్న టిప్పర్‌.. కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. ఆయన కూడా చికిత్స పొందుతూ మరణించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో మరణించినవారు సత్యనారాయణ, వెంకటయ్యగా పోలీసులు గుర్తించారు. మృతులు బిజినేపల్లి మండలం మంగనూరు వాసులని పోలీసులు తెలిపారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.