తెలంగాణ భవన్ లో అగ్ని ప్రమాదం.

 


టీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించారు. దీంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చారు. కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి బాణాసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు తెలంగాణ భవన్‌ పై పడ్డాయి. దీంతో పైకప్పు తగలబడుతోంది. తెలంగాణ భవన్‌లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి