ఏపీ లో విద్యార్థులకు ముఖ్య గమినిక.

 


అసలే కరోనా కష్టాలు..ఆపై అరకొర జీతాలు..కరోనా నుంచి బయటపడని జీవితాలు. ఈ క్రమంలో పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. అయితే ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద కుటుంబాలకు చేయూతగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. అలాగే జగనన్న వసతి దీవెన కింద కోర్సు బట్టి విద్యార్ధుల హాస్టల్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇక ఆ డబ్బులను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి జగన్ సర్కార్ జమ చేస్తుంది. ఇదిలా ఉండగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పధకాలలో చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. ఈ రెండు పధకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువు వాస్తవానికి ఈ నెల 25వ తేదీతో ముగియగా… పలువురు విద్యార్ధులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ గడువును మార్చి 28వ తేదీ వరకు పొడిగించింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు త్వరతగిన ఈ రెండు పధకాలకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.