స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధింపు.

 


ఇంగ్లాండ్‌పై రెండో టీ20 విజయం సాధించిన ఆనందంలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారీ జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు టీమిండియా ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాధ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ పున: ప్రారంభం తర్వాత టీమిండియాకు జరిమానా పడటం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండుసార్లు భారత్‌కు జరిమానా పడిన సంగతి తెలిసిందే. కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం విదితమే. కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెబ్యూ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ వీరోచిత అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. దీనితో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం అయింది.