ఏపీ లో టెన్త్ విద్యార్థులకు అలెర్ట్....

 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి టెన్త్ ఎగ్జామ్స్ విషయంలో హెచ్ఎంలకు సూచనలు చేస్తూ కీలక సర్క్యులర్ ను జారీ చేశారు. జూన్‌లో నిర్వహించనున్న టెన్త్ ఎగ్జామ్స్ విధానంలో మార్పులు, నామినల్‌ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సారి పబ్లిక్‌ పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని సర్క్యులర్ లో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్షలకు తొలిసారిగా హాజరు కానున్న రెగ్యులర్‌ విద్యార్థులు తెలుగును ఫస్ట్‌ లాంగ్వేజ్‌ లేదా సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. తెలుగు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌గా ఉన్న విద్యార్థులు సెకండ్‌ లాంగ్వేజ్‌ గా హిందీని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా తెలుగును ఎంచుకుంటే.. సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేశారు. వీటితో పాటు తమిళం, కన్నడ, ఒరియా తదితర భాషలను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్‌గా తెలుగును తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సారి టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు ఉంటాయి. ఆ ఏడు పేపర్లలో ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్, థర్డ్‌ లాంగ్వేజ్, మాథ్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలను వంద మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటాయి. సైన్స్ మాత్రం ఈ సారి రెండు పరీక్షలుగా నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలు ఉంటాయి. ఒక్కో పరీక్షలకు 50 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్‌ పరీక్షలు, మాథ్స్, సోషల్‌ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్‌కు 3 గంటలు సమయం ఇస్తారు. ప్రశ్నపత్రం చదువుకునేందుకు మరో 15 నిమిషాలు ఇస్తారు. ప్రతీ విద్యార్థికి మొత్తం 3 గంటల 15 నిమిషాల సమయం ఇస్తారు. ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు సమయం ఉంటుంది. ప్రశ్నపత్రం చదువుకునేందుకు మరో 15 నిమిషాలు ఇస్తారు. దీంతో ఒక్కో పరీక్షకు 2.45 గంటలు కేటాయిస్తారు. -2017 మార్చిలో మొదటిసారి టెన్త్‌ పరీక్షలకు హాజరై 2019 జూన్‌ వరకు ఆ పరీక్షల్లో పాస్ కాలేక పోయిన వారు ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్‌ అయ్యే అవకాశాన్ని కల్పించారు. స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్‌ అభ్యర్థులుగా పరిగణించనున్నారు