చరణ్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమనుల నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

 


టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఫ్యాన్స్ మునిగి తేలుతున్నారు..మార్చ్ 27 అనగా ఈ రోజుతో చరణ్ తన 36వ ఏటా అడుగుపెట్టారు.. ఇక సోషల్ మీడియాలో వారం రోజులుగా సందడి చేస్తున్న మెగా ఫ్యాన్స్, భౌతికంగా కూడా అనేక చోట్ల చరణ్ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు..చరణ్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమనుల నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా జూనీయర్‌ ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా బానం విసురుతున్న చెర్రి లుక్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ..'ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు.. అతడే నా సోదరుడు రామ్‌చరణ్‌' అంటూ విష్‌ చేశాడు. అలాగే ఈ చిట్టిబాబు హీరోయిన్‌ అక్కినేని వారి కోడలు సమంత కూడా శుభాకాంక్షలు తెలిపింది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా హ్యాపీ బర్త్‌డే మై స్వీట్‌ బ్రదర్‌ అంటూ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు.అంతేగాక బుట్ట బొమ్మ పూజ హెగ్డె, యాంకర్‌ అనసూయతో పలువురు చెర్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..ఇందులో భాగంగానే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా విష్ చేస్తూ...many many happy returns of the day to my sweetest brother" అని... అలాగే హీరోయిన్ పూజా హెగ్డే ట్వీట్ చేస్తూ.."Wishing mega power star @always ram charan a very happiest bdy:" అంటూ రామ్ చరణ్ కి తమ బెస్ట్ విషెస్ తెలియజేసారు...మరోవైపు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెష్ తెలియజేశారు.చరణ్ కి విషెష్ చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. బాల్యంలో చిరంజీవికి చరణ్ గొడుకు పడుతున్న ఫోటో, ప్రస్తుతం షూటింగ్ సెట్స్ లో తనకు గొడ్డుపడుతున్న ఫోటోలు వీడియోలో చిరంజీవి పంచుకున్నారు...ఇక ప్రస్తుతం రామ్ చరణ్ rrr తో పాటు.. ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.. ఈ రెండు సినిమాలకు సంబంధించి చరణ్ లేటెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయి ఫ్యాన్స్ ని తెగ ఖుషీ చేస్తున్నాయి..!!