వంట గ్యాస్ వినయోగదారులకు గుడ్ న్యూస్.

 


కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. వంట గ్యాస్ ధరలు చుక్కలను తాకుతున్న వేళ.. సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలోనే ఉజ్వల లబ్దిదారులకు ఊరటను కలిగించేందుకు సిద్దమైంది. అంతర్జాతీయ చమురు ఉత్పత్తుల ధరలు ఆధారంగా గ్యాస్ సిలండర్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఉజ్వల స్కీం లబ్దిదారులకు మూడు నెలల పాటు గ్యాస్ సిలండర్లను ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను పరిశీలిస్తోందట. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 26 లక్షల మందికి వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 1.42 లక్షల కుటుంబాలు ఉజ్వల స్కీం లబ్దిదారులు కాగా.. కేంద్రం పరిశీలిస్తున్న మూడు నెలల ఉచిత గ్యాస్ సిలండర్ల ప్రతిపాదన గనక అమలు అయితే.. వారందరికీ లబ్ది చేకూరనుంది. కాగా, కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద ఉజ్వల స్కీం లబ్దిదారులకు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే.