చితక్కొట్టిన స్మృతి మంధనా.

 


దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో భారత మహిళా క్రికెెట్ టీమ్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరింత పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఆడి ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో మిథాలీసేన ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత టీమ్ కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది. దీనితో, ఇరు జట్ల మధ్య 5 వన్డే సిరీస్ ఇప్పుడు మరోసారి సమానంగా ఉంది. మొదటి 2 మ్యాచ్‌ల తరువాత, ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమానంగా ఉంది. టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన (80), పూనమ్​ రౌత్​ (60) చెరో అర్ధశతకంతో దుమ్మరేపారు. అద్భుత షాట్లతో అలరించి.. సునాయాస విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా విమెన్స్ టీమ్ 41 ఓవర్లలో 157 పరుగుల చేసి ఆలౌట్​ అయ్యింది. భారత బౌలర్లు గోస్వామి 4 వికెట్లతో చెలరేగగా.. గైక్వాడ్​(3), మానసి జోషీ (1) వికెట్లు పడగొట్టారు. చితక్కొట్టిన స్మృతి మంధనా ఈ మ్యాచ్‌లో స్మృతి మంధనా తన ఇన్నింగ్స్‌ను 2 బ్యాక్ టు బ్యాక్‌ సిక్సర్లతో ప్రారంభించింది. అదే దూకుడుతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని క్లాసిక్ ఫోర్లు మంధనా బ్యాట్ నుంచి జాలువారాయి. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధనా 64 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆమె ఇన్సింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అదరగొట్టిన పూనమ్ రౌత్ మరొక వైపు నుంచి, పూనం రౌత్ కూడా అదరగొట్టింది. సెంచరీ భాగస్వామ్యంలో మంధనకు ఆమె మంచి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే పూనమ్ 14 వ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఆమె 89 బంతుల్లో 62 పరుగులు చేశారు. అందులో 8 ఫోర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బారత బౌలర్లు అంతకుముందు రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లఖ్​నవూ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను స్థిరంగా ఆడనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికాను పూర్తిగా 50 ఓవర్లు కూడా ఆడనివ్వలేదు. ఫలితంగా, 41 ఓవర్లలో 157 పరుగులు చేసిన విజిటింగ్ జట్టు ఆలౌట్ అయింది. భారత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.