చెర్రీ బర్త్ డే కు స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్న ఆర్. ఆర్. ఆర్ మూవీ టీం.

 


ఈ నెల 27న మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్ కొత్త సినిమాల అప్డేట్ లతో పాటుగా.. ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి కూడా స్పెషల్‌ గిఫ్ట్‌ రానుందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చెర్రీ బర్త్‌ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి ప్రత్యేక వీడియో రానుందని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో చరణ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి చరణ్ లుక్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే దిగ్గజ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ రూపొందనుంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కూడా ఇవ్వడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట