రోజురోజుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా పై అంచనాలు పెంచుతున్న రాజమౌళి.

 


ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బడా మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం రణం రుధిరం' . బాలీవుడ్ నుంచి కూడా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు సెట్ అయ్యాయో కూడా తెలుసు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఆ అంచనాలను కూడా అభిమానుల్లో మరో స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ పార్ట్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. అలా ఈ సినిమాలో లేటెస్ట్ గా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ తో డిజైన్ చేస్తున్న క్లైమాక్స్ షాట్ పై అప్డేట్ ఇచ్చి RRR ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. దీనితో ఇక్కడ నుంచి ఈ సినిమాలో యాక్షన్ మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువగా అయితే రాజమౌళి చూపించట్లేదు అని చరణ్ మరియు తారక్ అభిమానులు ఒక ఫైనల్ క్లారిటీకి వచ్చేసారు. మరి రాజమౌళి ఈ సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ ను ప్లాన్ చేసారో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13వరకు ఆగక తప్పదు