సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆచార్య సినిమా ఫొటోలు

 


మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుపుకుంటుంది. అయితే తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సాయుధ దళాల దుస్తుల్లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా తమ అభిమాన హీరో ఈ దుస్తుల్లో కనిపించడంతో మెగాస్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఆచార్య సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాలో చిరు పాత్రపై ఇప్పుడు హాట్ టాఫిక్ నడుస్తుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా షూటింగ్ ఇల్లందులోని జేకె మైనింగ్స్‌లో జరగుతుంది. షూటింగ్ కోసం చిత్ర బృందం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి అనుమతులను తీసుకుంది. మార్చి 7 (నేటినుంచి) మార్చి 15 వరకుషూటింగ్ జరపనున్నారు. ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెగాస్టార్ అలాగే రామ్ చరణ్ వస్తున్నారని తెలియడంతో బొగ్గుగనులవద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ మంత్రిపువ్వాడ అజయ్ ఇంట్లోనే బస చేయనున్నట్లు తెలిసింది.