హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం.

 


హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డుకి వస్తున్న లారీ, అకస్మాత్తుగా ఆగి ఉన్న బైక్ సహా మరికొన్ని వాహనాలను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్నఫళంగా లారీ దూసుకురావడంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఆగి ఉన్న పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మ‌ృతి చెందిన వ్యక్తి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమ్మితం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తులకు దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.