న్యూజిలాండ్‌ దేశంలో భారీ భూకంపం .

 


న్యూజిలాండ్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్డార్‌ స్కేల్‌పై ఏకంగా 7.3 తీవ్రత నమోదైనట్లు గుర్తించారు. న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. మొదటగా ఈ భూంకంప తీవ్రత గిస్బ్రోన్‌ పట్టణానికి 178 కి.మీల దూరంలో పది కిలో మీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భారీ భూకంపం రావడంతో న్యూజిలాండ్‌ నేషనల్‌ ఎమర్జన్సీ మేనెజ్‌మెంట్‌ ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ స్థాయిలో భూమికంపించడంతో సునామీ వచ్చే అవకాశాలున్న కోణంలో కూడా అధికారలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే గతంలో 2011లో రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతో క్రిస్ట్‌ చర్చ్‌లో భూకంపం వచ్చింది. ఈ ధాటికి ఏకంగా 185 మంది ప్రాణాలను వదిలారు. ఇక తాజాగా సంభవించిన భూకంపంలో ఎంత వరకు ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.