అమెరికాలో హల్ చల్ చేస్తున్న "జాతి రత్నాలు".

 


యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష ప్రధాన పాత్రలో నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించగా.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు కూడా అంతే ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి.. అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‏లో ఎంజాయ్ చేస్తున్న నవీన్ పోలీశెట్టి, ప్రియదర్శి… అక్కడి బ్రూక్లిన్ వంతెన దగ్గర నిల్చోని ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో నవీన్, ప్రియదర్శి మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రెడింగ్ సినిమాస్‏లో స్క్రీనింగ్ కాబోతుందంటూ.. చెప్పుకోచ్చారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘జాతిరత్నాలు’ మొదటి వారంలో రూ. 27.70 కోట్లు షేర్ తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డునే దాటేసింది. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమాలకు సెంటర్ పాయింట్. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. వారం రోజుల్లో భారీ వసూళ్లను సాధించిన సినిమాల్లో జాతిరత్నాలు మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే బాహుబలి పార్ట్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా దాటేసింది. 2017 సంవత్సరం ఏప్రిల్ నెలలో బాహుబలి 2 విడుదలైంది.ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో ఒకటైన సుదర్శన థియేటర్లో 36 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది