నిట్‌ పుదుచ్చేరిలో ఉద్యోగాలు..

 


ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నిట్‌ పుదుచ్చేరిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పోస్టులు, అప్లై చేసుకునే విధానం ఇలా అనేక విషయాలు మీకోసం. ఇక వివరాల లోకి వెళితే… నిట్‌ పుదుచ్చేరి లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌-03, సూపరిం టెండెంట్‌- 02, జూనియర్‌ అసిస్టెంట్‌ లర్థ సీనియర్‌ అసిస్టెంట్‌-04, ఆఫీస్‌ అటెండెంట్‌-01. ఈ పోస్టులని భర్తీ చేయనుంది. సులువుగా ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేసుకోవాలి అంటే.. ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో అప్లై చెయ్యాలంటే దరఖాస్తును ది రిజిస్ట్రార్‌ (ఐ/సి), నిట్‌ పుదుచ్చేరి, తిరువెట్టకుడి, కరైకల్‌-609609 చిరునామాకు పంపించాలి. ఈమెయిల్ ద్వారా పంపాలంటే ad&[email protected] కి పంపవచ్చు. మీరు ఈమెయిల్ ద్వారా పంపాలి అంటే మార్చి 10, 2021 ఆఖరి తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాలనుకునే వాళ్ళు మార్చి 15, 2021 తేది లోగ పంపాలి. స్కిల్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.nitpy.ac.in లో చూడవచ్చు.