‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్.

 


దర్శకధీరుడు రాజమౌళీ భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. వీరికి జోడీలుగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇద్దరు అగ్రహీరోలు నటిస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా గురించి ఆది నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా పాత్రలను పరిచయం చేశాడు జక్కన్న. తాజాగా అభిమానులకు మరో సర్‏ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2న అజయ్ దేవగణ్ పుట్టిన రోజు కావడంతో ఆరోజున అజయ్ ఫస్ట్ లుక్‏తోపాటు మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అజయ్ దేవ్‏గణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రం నాకొక ఉత్తేజకరమైన అనుభవాన్నిచ్చింది. ఇందులో రాజమౌళి సృష్టించిన నా పాత్రను మీకు పరిచయం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు గురువుగా, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్పటికే హీరోహీరోయిన్ల పుట్టిన రోజు సందర్భంగా వారికి సంబంధించిన పోస్టర్లను రివీల్ చేస్తూ వస్తున్నాడు డైరెక్టర్. ఇక ఇందులో సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.