వరల్డ్ నెంబర్ వన్ గా భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా

 


మరోసారి విశ్వ విజేతగా నిలిచాడు భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా.తన వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో అతడు స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు.ఫైనల్లో మంగోలియా ఆటగాడు తుల్గా తుమర్‌ ఒచిర్‌ను ఓడించాడు. ముందుగా ప్రత్యర్థిని 2-0తో ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలో చివరి వరకు పోరాడిన బజరంగ్‌ పునియా చివరి 30 సెకన్లలో 2 పాయింట్లను దక్కించుకుని స్కోరు సమం చేశాడు. అయితే స్కోరు సమానం అయినప్పటికీ.. రూల్స్ ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారికే విజయం దక్కుతుంది. కోవిడ్ వైరస్‌ కారణంగా ఏడాదిపాటు ఆటకు దూరమైన బజరంగ్‌ తన డిఫెన్స్‌ను మరింత మెరుగు పర్చుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. రెండో ర్యాంకుతో సిరీసులోకి ఎంట్రీ ఇచ్చిన బజరంగ్‌ ఈ విజయంతో అగ్రస్థానంను దక్కించుకున్నాడు. చివరి వరకు ఒచిర్‌పై ఇబ్బంది పడటానికి కారణం తాను పోటీ ఉన్న 65 కిలోల విభాగంలో ఉన్నానని వెల్లడించాడు. మంగోలియన్‌ ఆటగాడు ఒచిర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒచిర్ బలహీన ప్రత్యర్థి కాదని అన్నాడు. ఈ విభాగంలో ప్రతి రెజ్లర్‌ టోక్యోలో అదరగొట్టాలన్న కసితో ఆడుతున్నారని బజరంగ్ వెల్లడించాడు. కుస్తీలో ఒడుదొడుకులు తప్పవని… ఏదేమైనా తిరిగి రింగులో అడుగు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తన అభిప్రాయపడ్డాడు. ఐరోపాలో కోవిడ్ ఆంక్షలు మళ్లీ విధిస్తుండటం వల్ల ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లడమైతే తేలిక కాదని బజరంగ్‌ తెలిపాడు. విశాల్‌కు కాంస్యంభారత్‌కే చెందిన మరో రెజ్లర్‌ విశాల్‌ కాళిరామన్‌ 70 కిలోల విభాగంలో కాంస్యం అందుకున్నాడు. కజక్‌స్థాన్‌ ఆటగాడు సిర్బజ్‌ తల్గట్‌పై 5-1 తేడాతో ఘన విజయం సాధించాడు. కాగా ఈ విభాగం ఒలింపిక్స్‌లో లేదు.డోపింగ్‌ పరీక్షల్లో విఫలమై నాలుగేళ్లు నిషేధానికి గురైన నర్సింగ్‌ యాదవ్‌ పతకం అందుకోవడంలో విఫలమయ్యాడు. కాంస్య పోరులో 0-5 తేడాతో డేనియర్‌ కైసనోవ్‌ చేతుల్లో పరాజయం పాలయ్యాడు. మొత్తంగా ఈ సిరీసులో భారత్‌ ఏడు పతకాలు కైవసం చేసుకోవడం గమనార్హం.