బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గొంతోటి వెంకటసుబ్బయ్య భౌతిక కాయనికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఘన నివాళి అర్పించారు..

 


బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గొంతోటి వెంకటసుబ్బయ్య భౌతిక కాయనికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. కొంచెంసేపటి క్రితం కడప వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. కడప నగరంలోని కో ఆపరేటివ్ కాలనీలోని దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నివిధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే లు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్సీ లు గోవింద్ రెడ్డి, జకీయా ఖానం, సి రామచంద్రయ్య తదితరులు నివాళులు అర్పించారు. ఇలా ఉండగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ వెంకట సుబ్బయ్య 2019 లో మొదటి సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 కు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.