ఇన్‌స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్.

 


సోషల్ మీడియా లో ఎన్ని రకాల మార్పులు రావడం చూస్తుంటాం.. కొత్త టెక్నాలజీ వస్తే ఆటోమేటిక్ గా అన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు ఇన్స్టా కూడా పూర్తిగా మారిపోయింది. కొత్త ఫీచర్లను అందుబాటు లోకి తేవడంలో ముందుంటుంది ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్.. కొత్త ఫీచర్ల ను చేరుస్తూనే వినియోగ దారుల డేటా భద్రతకు పెద్దపీట వేస్తోంది. అందువల్లే, 1 బిలియన్ క్రియాశీల వినియోగదారుల ను కలిగి ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్లలో ఒకటిగా కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ వరుస ఫీచర్లను విడుదల చేస్తూ వినియోగ దారులను తెగ ఆకర్షిస్తుంది..ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ, ఐజిటివి, రీల్స్ ఫీచర్లను అందుబాటు లోకి తెచ్చింది. అంతే కాక, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్లో ఉన్న విధంగా డైరెక్ట్ మెసేజెస్ ద్వారా కూడా ఇతర కస్తమర్ల తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇస్టాగ్రామ్లోని డిఫాల్ట్ సెట్టింగ్ కారణంగా, అపరిచితులు మిమ్మల్ని యాదృచ్ఛికంగా స్పామ్ గ్రూప్లకు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా తెలియని వ్యక్తులు మిమ్మల్ని వివిధ గ్రూపు ల్లో యాడ్ చేయడం ద్వారా చిరాకు వస్తుంది. ఏవేవో పిచ్చి మెసేజ్ లు వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్ యాప్ను తెరిచి, మీ ప్రొఫైల్‌లోకి వెళ్లండి. అక్కడ టాప్ రైట్ కార్నర్‌ లో ఉండే థ్రీ లైన్ మెన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆపై సెట్టింగ్స్లోకి వెళ్లి, ప్రైవసీపై క్లిక్ చేసి, మెసేజెస్ను ఎంచుకోండి. అక్కడ 'గ్రూప్స్లో యాడ్ చేయడానికి ఇతరులను అనుమతించు' అనే సెక్షన్లోకి వెళ్లి, 'మీరు అనుసరించే వ్యక్తులను మాత్రమే ఎంచుకోండి.' అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోండి. దీని ద్వారా ఇకపై మీకు తెలియని యూజర్లు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయలేరు. కాగా, ఈ ఆప్షన్ కేవలం ప్రొఫెషనల్ అకౌంట్స్ మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు నోటిఫికేషన్లు మ్యూట్ చేసే వెసులుబాటును కూడా ఇన్స్టాగ్రామ్ అందిస్తుంది.