యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా నుండి అప్డేట్.

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఏప్రిల్‌ నెలలో వారం పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఎన్టీఆర్‌ మే, జూన్‌ నెలల్లో సినిమా కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తాడని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‏లో పాల్గొననున్నాడు. ఏప్రిల్ 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయాలని భావిస్తున్నాడ డైరెక్టర్. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమాను పూర్తిచేసి.. ఏప్రిల్‏లో విడుదల చేయాలని భావిస్తున్నాడట. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‏కు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి.