ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త.కియా మోటార్ సంస్థలో ఉద్యోగులకు నోటిఫికేషన్ రిలీజ్

 


ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీఎస్‌ఎస్‌డీసీ మరోసారి ఉద్యోగావకాశాలను తెలియజేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అనంతరపురం జిల్లాలోని కియా మోటార్ సంస్థలో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంటర్యూలను నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రంగాల్లో ట్రైనీలుగా పనిచేయడానికి దాదాపు 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్యూలో ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండ లోని కియా కార్ల కంపెనీలో పనిచేయాల్సి ఉంది. అయితే ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. అభ్యర్థులు ఏదైనా డిప్లమో పూర్తి చేసి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైనవారితో పాటు ప్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల నుంచి రూ. 15 వేల వరకూ వేతనం ఇస్తారు. మార్చి 16 ఉదయం 9 గంటలనుంచి ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంటర్యూలు నిర్వహించనున్నారు. ఆన్ లైన పరీక్షద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతరవివరాల కోసం 8074370846, 9848819682, 7981938644 సంప్రదించమని ఏపీఎస్‌ఎస్‌డీసీ కోరింది.