అలాస్కాలో కూలిన హెలికాఫ్టర్.

 


అలాస్కాలో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో అయిదుగురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం నాడు ఓ లాడ్జి నుంచి సరదాగా స్కై ట్రిప్ కి వెళ్లిన వీరు ఇలా ఘోర ప్రమాదం బారిన పడ్డారు. వీరిలో గెస్టులు, గైడ్లు ఉన్నారు. 33 ఏళ్ళ పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి కారణం తెలియలేదు. హెలికాఫ్టర్ కూలిన స్థలం వద్ద దీని శకలాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంపై అలాస్కా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొలరాడో నుంచి వఛ్చిన ఓ ప్రయాణికుడు, ఇద్దరు అలాస్కా వాసులు కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.