ప్రభాస్ ను ఫాలో అవుతున్న కేజీఎఫ్ స్టార్ యశ్.

 


ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా..అంటే కచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ రాకింగ్ స్టార్ యష్ అని ఈ ఇద్దరి పేర్లు ఎవరైనా వెంటనే చెప్పేస్తారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కు టోటల్ ఇండియా వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చే హీరోగా, తన పరిదిని ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ తరువాత టోటల్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మరో సౌత్ హీరో రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన " కేజిఎఫ్ " సినిమాతో యష్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. రాకీభాయ్ గా నార్త్ లోనూ స్థిరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకున్నాడు. తాజాగా యష్ నటిస్తున్న కేజిఎఫ్ సిక్వల్ " కేజిఎఫ్ 2 " యొక్క టీజర్ విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుందంటే ఇండియా వైడ్ గా యష్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడు. ప్రభాస్ బాహుబలితో వచ్చిన క్రేజ్‌తో "సాహో " హిందీ డబ్బింగ్ వెర్షన్‌ కోసం ప్రభాస్ ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇపుడు రాబోయే.. 'రాధే శ్యామ్'తో పాటు, ఆదిపురుష్', సలార్ హిందీ వెర్షన్స్ కోసం ప్రభాస్ ఓన్ డబ్బింగ్ చెబుతున్నాడు. మరోవైపు తమిళం, కన్నడలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. దీంతో యష్ కూడా ప్రభాస్ బాటలోనే వెళ్లాలని చూస్తున్నాడు. కేజీఎఫ్ 2 కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. స్వతహాగా యశ్‌కు హిందీలో మంచి పట్టు ఉంది. అందుకే ఇపుడు విడుదల కాబోయే కేజీఎఫ్ 2 కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పబోతున్నాడట.త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలంతోనే కాక తమ సొంత వాయిస్ తోకూడా టోటల్ ఇండియా వైడ్ గా అలరించేందుకు సిద్దమవుతున్నారు.