కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం .

 


కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న ఫైర్ సిబ్బందితో సహా తొమ్మది మంది సజీవదహనమయ్యారు. దీంతో మరోసారి మన రైల్వే స్టేషన్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ కోయిలా ఘాట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వేకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. సాయంత్రం గం. 6.30 సమయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు.

స్ట్రాండ్ రోడ్‌లోని 14 అంతస్థుల న్యూ కోయిలఘాట్ భవనంలోని 13వ అంతస్థులో అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. అప్రాంతమంతా పూర్తిగా దట్టమైన పొగ అలుముకుంది. రంగంలోకి దిగిన 25 ఫైరింజన్లు మంటలార్పేందుకు ప్రయత్నించాయి. ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ కోల్‌కతా ఏఎస్ఐ ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా…. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అయితే, అగ్ని ప్రమాదం ప్రమాద సంఘటనా స్థలానికి పరిశీలించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. సంభవించింది. మంటల్లో చిక్కుకున్న ఫైర్ సిబ్బందితో సహా తొమ్మది మంది సజీవదహనమయ్యారు. దీంతో మరోసారి మన రైల్వే స్టేషన్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ కోయిలా ఘాట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వేకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. సాయంత్రం గం. 6.30 సమయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. స్ట్రాండ్ రోడ్‌లోని 14 అంతస్థుల న్యూ కోయిలఘాట్ భవనంలోని 13వ అంతస్థులో అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. అప్రాంతమంతా పూర్తిగా దట్టమైన పొగ అలుముకుంది. రంగంలోకి దిగిన 25 ఫైరింజన్లు మంటలార్పేందుకు ప్రయత్నించాయి. ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ కోల్‌కతా ఏఎస్ఐ ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా…. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అయితే, అగ్ని ప్రమాదం ప్రమాద సంఘటనా స్థలానికి పరిశీలించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.