ముగియునున్న JEE మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ .

 


జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(JEE) మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2 ప్రారంభమైంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అయితే సమయం తక్కువ ఉండడంతో తప్పులు సవరించుకోవడానికి కరెక్షన్ విండోను అభ్యర్థులను అందుబాటులో ఉంచడం లేదు. మార్చి 6 సాయంత్రం 6 గంటల అనంతరం విద్యార్థులు అప్లికేషన్ ఫామ్ లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ 20మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 21 మార్చి సెషన్ పరీక్షను మార్చి 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అయితే NTA ఈ సమయంలో మిగతా సెషన్స్ కు సైతం అప్లై చేసుకోవడానికి లేదా విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. -అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta,nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. -అనంతరం రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. -పేరు, విద్యార్హతల వివరాలు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. -అనంతరం ఫొటోగ్రాఫ్, సంతకం స్కాన్ కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. -అనంతరం JEE Main 2021 అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. -అనంతరం కర్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.