అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న రెడ్‌మీ స్మార్ట్‌టీవీ X సిరీస్‌.

 


చైనాకు చెందిన షియోమీ కంపెనీ రెడ్‌మీ స్మార్ట్‌టీవీలను భారత్‌లో ఆవిష్కరించింది. రెడ్‌మీ స్మార్ట్‌టీవీ X సిరీస్‌లో మూడు సైజుల్లో అందుబాటులో ఉంది. కొత్త X సిరీస్‌ టీవీలన్నీ క్వాడ్‌ కోర్‌ ఏ55 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. ఎల్‌ఈడీ టీవీలు 50, 55, 65అంగుళాల్లో విడుదలైంది. రెడ్‌మీ టీవీ స్మార్ట్‌ కనెక్టివిటీ కోసం ఆండ్రాయిడ్‌ టీవీ10 ఆధారంగా పనిచేస్తుంది. 4K HDR, HDR 10+, డాల్బీ విజన్‌, 30W డాల్బీ ఆడియో స్పీకర్‌, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్యూటూత్‌ 5.0, వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌టీవీల ఫస్ట్‌సేల్‌ మార్చి 26న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఎంఐ డాట్‌ కామ్‌, అమెజాన్‌ డాట్‌ఇన్‌, ఎంఐ హోమ్‌, ఎంఐ స్టూడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.2వేల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందించనుంది. మూడు వేరియంట్ల ధరలు ఇలా..! రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X65 ధర రూ.57,999 రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X55 ధర రూ.38,999 రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X50 ధర రూ.32,999