ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిది. 1 నుంచి 9వ తరగతుల్లోని విద్యార్దులకు పరీక్షలు లేకుండానే అందర్నీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ అంటే నిన్న 1-9 తరగతుల విద్యార్థులకు లాస్ట్ వర్కింగ్ డే అని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం యధా విధిగా క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.


షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు పెట్టాలని స్పష్టీకరణ. అలానే 1-9వ తరగతుల విద్యార్ధులకు డ్రై రేషన్ పంపిణీ చేయాలని సూచనలు చేసిన సర్కార్ పదో తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నా భోజన అందివ్వాలని పేర్కొంది. సీఎం సమక్షంలో జరిగిన హై లెవల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే మొదలైందని, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని నిన్న మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.