దేశంలోని 10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్

 


 దేశంలోని 10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ విజృంభిస్తోందని, డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో విస్తృతంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. గతంలో కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో మరోసారి కరోనా పాజిటివ్ వస్తోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో 18 నుండి 45 సంవత్సరాలలోపు వారిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఉత్పరివర్తన జాతులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం.. కోవిడ్-19 కేసులు వేగంగా పెరగడంలో ఈ మార్పుచెందిన వైరస్ కలిగిన వారు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య వర్గాలు అంటున్నాయి.


ఢిల్లీలో యుకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటేషన్లతో కూడిన జాతులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.