'ఆచార్య' చిత్రంతో పాటే మే 13న 'మరక్కల్' సైతం విడుదల వాయిదా

 


మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన చిత్రం 'మరక్కర్'. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమాకు 'లయన్ ఆఫ్‌ ది అరేబియన్ సీ' అనేది ట్యాగ్ లైన్. 16వ శతాబ్దానికి చెందిన మలయాళ నౌక కెప్టెన్ కుంజలి మరక్కర్ కథ ఇది. మోహన్ లాల్ తో పాటు అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే... ఈ మలయాళ చిత్రం విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులను అందుకుంది. ఉత్తమ చిత్రంతో పాటుగా బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరిలకు ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రంతో పాటే మే 13న 'మరక్కల్' సైతం విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 'ఆచార్య'ను వాయిదా వేసినట్టుగానే మోహన్ లాల్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'మరక్కల్'నూ పోస్ట్ పోస్ చేశారు. దీనిని వరల్డ్ వైడ్ ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఆంటోని పెరుంబవూర్ తెలిపారు.