ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో 14 ప్రత్యేక రైళ్లు రద్దు

 


ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో 14 ప్రత్యేక రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రామేశ్వరం-కన్నియాకుమారి (నెం.06165), కన్నియాకుమారి-రామేశ్వరం (నెం.06166). కొచ్చువెల్లి-భాన్సువాడ (నెం.06319), భాన్సువాడ- కొచ్చువెల్లి (నెం.06320), కోయంబత్తూర్‌-కేఎస్‌ఆర్‌ బెంగుళూరు (నెం.06154), కేఎస్‌ ఆర్‌ బెంగుళూరు- కోయంబత్తూర్‌ (నెం.06153), డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ -మైసూరు (నెం.06081), మైసూరు-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (నెం.06082), డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-కోయంబత్తూర్‌ (నెం.06029), కోయంబత్తూర్‌- డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (నెం.06030), ఎర్నాకుళం- భాన్సువాడ (నెం.06129), భాన్సువాడ-ఎర్నాకుళం (నెం.06130), మైసూరు- రేణిగుంట (నెం.01065), రేణిగుంట-మైసూరు (నెం.01066) రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షణ రైల్వే తెలిపింది.