రేపటి నుంచి వచ్చేనెల 14 వరకు పాస్‌పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి తెలంగాణలో గత వారంరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ఈ నెల 30 తరువాత లాక్‌డౌన్ విధించే పరిస్థితి నేపధ్యంలో... రేపటి నుంచి వచ్చేనెల 14 వరకు పాస్‌పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్‌పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్‌పోస్టు సేవలనందిస్తోన్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయం గురువారం నుంచి అమలుకానుంది. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులు అనుకూలించినపక్షంలో... పాస్‌పోర్టు సేవాలను మళ్ళీ ప్రారంభించనున్నారు.