దక్షిణ ఒడిశా, దాని పరిసరాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనందక్షిణ ఒడిశా, దాని పరిసరాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ఆంధ్రాలో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.