హిస్టరీలోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా రికార్డ్

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. కాల్పనిక గాథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. కరోనా వలన చిత్రం పలు మార్లు వాయిదా పడగా, పోస్టర్స్, టీజర్స్‌తో అభిమానులను సంతోష పరుస్తున్నారు. ఆ మధ్య చరణ్‌, ఎన్టీఆర్‌లకు సంబంధించిన టీజర్ విడుదల చేశాడు జక్కన్న.


భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఉగ్రరూపం ప్రదర్శించగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన డైలాగ్స్ కూడా ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించాయి. అయితే "రౌద్రం రణం రుధిరం" నుంచి వచ్చిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ సెన్సేషనల్ రికార్డులు సెట్ చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా రికార్డ్ సృష్టించిన ఈ టీజర్ ఇప్పుడు 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సెట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.