నెట్ ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 21 అర్ధరాత్రి 12 గంటల నుంచి........

 


అక్కినేని నాగార్జున, సైయామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఆశిషోర్ సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో ఆడలేకపోయింది. కాగా, నేటి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ మూవీని మొదటి నుంచి నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. అంతేకాదు, ఓటీటీ రిలీజ్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్న చిత్రబృందం చివరి నిమిషంలో థియేట్రికల్ రిలీజ్ వైపు మొగ్గు చూపడంతో చాలా నష్టం ఎదురైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 21 అర్ధరాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. అంటే రిలీజైన కేవలం 19 రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.