రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

 
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తాలు, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాగల 24 గంటల్లో కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. రాయలసీమలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.