మే 2 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు

 

మే 2 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎ


న్నికల ఫలితాలు రాబోతున్నాయి. మామూలు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తెలిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. పార్టీలు హడావుడి ఎక్కువగా ఉంటుంది. సభలు, సమావేశాలు, హంగామా ఉంటుంది. కానీ, ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నది. ఈ సమయంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించారు. ఫలితాలు వెలువడే మే 2 వ తేదీన ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపు ర్యాలీలు వంటివి చేయకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి దృవీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంట ఇద్దరు మాత్రమే ఉండాలని ఈసీ ఆదేశించింది.