యాన్యుటీకి 40శాతం నిబంధన తప్పనిసరి కాదని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA స్పష్టంయాన్యుటీకి 40శాతం నిబంధన తప్పనిసరి కాదని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA స్పష్టం చేసింది. పదవీ విరమణ సమయంలో నేషనల్ పెన్షన్ స్కీం (NPS) ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతం నిధులతో యాన్యుటీ కొనడం ఇక ఐచ్ఛికం కానుంది. ఇప్పటి వరకు 40 శాతంతో యాన్యుటీ కొనుగోలు తప్పనిసరి. మిగతా 60 శాతం సొమ్ము మాత్రమే NPS ఖాతాదారులు ఏకమొత్తంలో తీసుకునే అవకాశం ఉంది.


అయితే ఖాతాలోని నిధులపై తక్కువ రాబడులు, పెరుగుతున్న ద్రవ్యోల్భణం నేపథ్యంలో ఖాతాదారులకు ప్రతికూల రాబడులు వస్తున్నందున 40 శాతం నిర్బంధ యాన్యుటీ కొనుగోలు నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్లు PFRDA చైర్మన్ తెలిపారు.


యాన్యుటీకి 40 శాతం ఐచ్ఛికం కానున్న నేపథ్యంలో ఖాతాలో రూ.5 లక్షల వరకు నిధులు ఉన్నవారు మొత్తం సొమ్మును తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. 40 శాతం మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయడం లేదా ఎస్‌డబ్ల్యుపీ ద్వారా కొన్నేళ్ల కాలపరిమితిలో నిధులు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తూ PFRDA చట్టం 2013కి త్వరలో సవరణలు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.