474వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు.

 




ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి 474వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ,అ నంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా నేప474వ రోజుకు థ్యంలో సూచనలు పాటిస్తూ రైతుల ఉద్యమం కొనసాగుతోంది. అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా సాధిస్తామని అమరావతి రైతులు అంటున్నారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.