సుమారు 500 లీటర్ల క్రూడ్ ఆయిల్‌కు ఎత్తుకెళ్లారు

 


ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) పైపులైన్ నుంచి కొందరు దుండగులు చమురు దొంగలించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్నది. వలసటిప్ప వద్ద ఉన్న ఓఎన్‌జీసీ నుంచి సుమారు 500 లీటర్ల క్రూడ్ ఆయిల్‌కు ఎత్తుకెళ్లారు. అయితే ఆ ఇంధనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఓఎన్జీసీ పైపులైన్ నుంచి దుండగులు 500 లీటర్ల ఇంధనాన్ని చోరీ చేసినట్లు ఉప్పాలగుప్తం ఎస్ఐ కే సురేశ్ బాబు తెలిపారు. రెయిడింగ్‌కు వెళ్లినప్పుడు దుండగులు తమ వద్ద ఉన్న ఇంధనాన్ని, వాహనాన్ని వదిలేసివెళ్లినట్లు పోలీసులు చెప్పారు.