ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల కు 6 లేదా 7 తేదీల్లో జీతాలు చెల్లించే అవకాశం.

 


ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా వేతనాలు, పెన్షన్లు అందలేదు. మొత్తం 4.5 లక్షల ఉద్యోగులకు వేతనాలు, 3.5 లక్షల పెన్షనర్లకు పెన్షన్లు అందలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను గవర్నర్‌ ఆమోదించినా పద్దులకు నిధులు సర్దుబాటు కాలేదు. సరిపడా నిధులు లేకపోవడంతో ఆర్థికశాఖ నుంచి ఆర్బీఐకి బిల్లులు అందలేదు. దీంతో నిధుల లభ్యత బట్టే ఆర్థికశాఖ అధికారుల చెల్లింపులు జరపనుంది. వరుస సెలవులతో ఆయా ఖాతాల్లో చెల్లింపులు నమోదు కాలేదు. అయితే.. ఈ పరిస్థితులన్నీ చక్కబడేకి ఇంకో రెండు నుంచి మూడ్రోజులు పడుతుందని తెలుస్తోంది. ఈ నెల 6 లేదా 7 తేదీల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉందని సమాచారం. జీతాలు అందని తర్వాత పెన్షన్లు వచ్చే అవకాశముందట. ఇదిలా ఉంటే.. ఏపీలో ప్రస్తుతం... ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతా లు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. అందుకే... జీతాల చెల్లింపుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండింటికీ ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది