సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని ఎస్‌ఆర్‌ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండి

 


సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని ఎస్‌ఆర్‌ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండిపడింది.


ఏడాది క్రితం కాలువకు మరమ్మతులు చేసిన చోటే మరోసారి కాలువకు గండిపడింది. దీంతో ధర్మాపురం శివారులోని మేగ్యాతండా వద్ద గోదావరి జలాలు వృథా పోతున్నాయి.


కాల్వ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదని ఇప్పటికే ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కాల్వ గండిని పూడ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.