శాండిల్ వుడ్‌లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ రాకెట్...

 


 శాండిల్ వుడ్‌లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో హీరోయిన్‌ సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది. తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్‌మెన్‌పై చీటింగ్‌ కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఇందులో కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్‌ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని,ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది.