ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

 


ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో కరోనాను ఎలా కట్టడి చేయాలి, కట్టడి నివారణ చర్యలను ఎలా పర్యవేక్షించాలి, వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా ఎలా నిర్వహించాలి తదితర అంశాలపై చర్చించబోతున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జరుగుతున్న భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అటు మరణాల రేటు కూడా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో దీనిపై కూడా ఈరోజు జరిగే సబ్ కమిటీ భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.