జగిత్యాల జిల్లాలో గొర్రెల పంపిణీలో గోల్ మాల్

 


జగిత్యాల: జిల్లాలో గొర్రెల పంపిణీలో గోల్ మాల్ జరిగింది. గొర్రెలకు బదులు డబ్బులు ఇస్తామని బ్రోకర్లు అంటున్నారు. అధికారులతో కుమ్మక్కయి.. కింది నుంచి పై వరకు లంచాలు ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. లబ్దిదారులతో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఒక్క యూనిట్ ధర లక్షా ఇరవై ఐదు వేలు. లబ్దిదారులు రూ. 31,250 కడితే మిగతా మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే లబ్దిదారులకు రూ. 70 వేలు మాత్రమే ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఒకే యూనిట్ గొర్రెలతో పదిమందికి పంపిణీ చేస్తున్నారు. ఫోటో దిగి అదే యూనిట్ మరొకరికి ఇస్తున్నట్లు వ్యాపారులు చూపెడుతున్నారు. వారి సెల్ ఫోన్ సంభాషణ ఏబీఎన్ చేతికి చిక్కింది.