మరపడవ మరమ్మతుకు గురవ్వ డంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మత్స్యకారులు

 


మరపడవ మరమ్మతుకు గురవ్వ డంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మత్స్యకారులను భారత కోస్టుగార్డు దళం రక్షించింది. గురువారం ఉదయం కారైక్కల్‌ తీరంలో పహారా కాస్తున్న కోర్టుగార్డు దళానికి మత్స్యకారులు అత్యవసర సమాచారం పంపించారు. తమ మరపడవ మోటారు చెడిపోవడంతో తాము ప్రమాదంలో చిక్కుకున్నామని తమకు ప్రత్యేకంగా అందించిన రేడియోలో పేర్కొన్నారు. వారు తీరానికి 15 నాటికల్‌ మైళ్లదూరంలో వున్నట్లు గ్రహించిన కోస్టుగార్డుదళం ప్రత్యేక షిప్‌లో వెళ్లింది. ఆ మరపడవ సహా ఎనిమిదిమందిని రక్షించి నాగపట్టినం రెవెన్యూ అధికారులకు అప్పగించింది.