దేశ వ్యాప్తంగా కరోనా కోరలు

 


 దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్‌ డౌన్‌ (పాక్షిక లాక్‌ డౌన్‌)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్‌ 144, నైట్‌ కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.తాజాగా కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ష్ర్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే.