తనకు పార్టీ మారే ఆలోచనే లేదని ... మాజీ ఎంపీ బుట్టా రేణుక

 

 తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ బుట్టా రేణుక గురువారం స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచనే లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను మళ్లీ టీడీపీలోకి వెళ్తున్నాననే పుకార్లను నమ్మొద్దని బుట్టా రేణుక సూచించారు. తాను ప్రస్తుతం వైసీపీలో కంఫర్ట్‌గానే ఉన్నానని, రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు.