ఎస్‌ఐ రఘు నేతృత్వంలో పోలీసులు గస్తీ

 


బళ్లారిరూరల్‌ పరిధిలోని బళ్లారి నుంచి గుంతకల్లు, గుత్తి ఎన్‌హెచ్‌ 63 కర్ణాటక సరిహద్దులో పోలీసుల సహాయంతో బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సులపై కొందరు దుండగులు రాళ్లు రువ్వుతున్న నేపథ్యంలో పీడీ హళ్లి ఎస్‌ఐ శశిధర్‌ నేతృత్వంలో పోలీసులు, ఏఎస్ఐ పరశురామ్‌, శంకర్‌ నాయక్‌, పలువురు పోలీసు సిబ్బంది, అదేవిధంగా బళ్లారి నుంచి కర్నూలుకు వెళ్లు దారి మోకా ఎస్‌ఐ రఘు నేతృత్వంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. బస్సులకు ముందుగా పోలీసులు ద్విచక్ర వాహనాలలో బయలుదేరి వెళ్లి బస్సులకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలో కేఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.